Prathidhwani:తెలుగు రాష్ట్రాల్లో నీటి వినియోగంపై ఇక బోర్డులే బాస్ లా? - prathidhwani latest
🎬 Watch Now: Feature Video

కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిని ఖరారు చేస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. ప్రతి పదం పరిశీలించి మరీ ఈ నోటిఫికేషన్ తీసుకువచ్చామని జలశక్తి శాఖ చెబుతోన్నా.. నోటిఫికేషన్లో ప్రస్తావించిన చాలా అంశాలపై రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా, గోదావరి నదీ పరివాహక ప్రాంతం పరిధిలో ప్రతి ప్రాజెక్టు, కాలువలను నదీ యాజమాన్య బోర్డుల పరిధిలోకి తేవటంపై పలు అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అసలు పరిధులకు సంబంధించి కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్లో ఏం ఉంది? రాష్ట్రాల నుంచి వ్యక్తమవుతున్న అభ్యంతరాలు ఏంటి? కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీలకు ఎలాంటి సవాళ్లు ఎదురుకానున్నాయి. ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.