ప్రతిధ్వని: చైనా వస్తువుల బహిష్కరణ సాధ్యమేనా? - ఈటీవీ ప్రతిధ్వని
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-7881808-655-7881808-1593790956863.jpg)
ఏకపక్షంగా వ్యవహరిస్తూ.. భారత సార్వభౌమత్వంపై దాడికి దిగుతున్న చైనాపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. చైనా వస్తువులను బహిష్కరించాలన్న నినాదం ఊపందుకుంటోంది. డ్రాగన్‌కు చెందిన పలు యాప్‌లను నిషేధించడం సహా హైవేల నిర్మాణంలో చైనా సంస్థలను భారత్ బహిష్కరించింది. అయినా చైనా ఉత్పత్తుల నిలిపివేత కేంద్రానికి అంత సులువు కాదు.. అందుకు ప్రపంచ వ్యాణిజ్య సంస్థ నిబంధనలు అనుమతించవు. కానీ ప్రజలు స్వచ్ఛందంగా చైనా వస్తువులను బహిష్కరించే వీలుంది. ఏటా చైనా నుంచి 5 లక్షల 25 వేల కోట్ల విలువైన వస్తువులను భారత్ దిగుమతి చేసుకుంటోంది. ఈ స్థాయిలో దేశంలోకి వచ్చిపడుతున్న చైనా వస్తువుల బహిష్కరణ ఆచరణ సాధ్యమైనా.. ఫలితాలు ఎలా ఉంటాయన్న దానిపై ప్రతిధ్వని చర్చ..