ప్రతిధ్వని: ఆన్లైన్ క్లాసులు.. అమెరికా ఆంక్షలు
🎬 Watch Now: Feature Video
అమెరికా విశ్వవిద్యాలయాలు ఆన్లైన్ మాధ్యమానికి మారినట్లైతే.. విదేశీ విద్యార్థులు వారి స్వదేశాలకు వెళ్లిపోవాలని ట్రంప్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. లేదా.. క్యాంపస్ లో తరగతులు బోధించే విశ్వ విద్యాలయాలకైనా బదిలీ కావాలని అమెరికా ఇమిగ్రేషన్ విభాగం సూచించింది. ఆన్లైన్ కోర్సుల్లో చేరిన విద్యార్థులకు వీసాలు మంజూరు చేయబోమని తెగేసి చెప్పింది. కరోనా సంక్షోభం నేపథ్యంలో.. రాబోయే సెమిస్టర్‌ను ఆన్లైన్లో నిర్వహించాలని ఇటీవల హార్వర్డ్ సహా.. చాలా విశ్వవిద్యాలయాలు నిర్ణయించాయి. ఈ కారణంగా.. అమెరికాలో చదువుతున్న దాదాపు 12 లక్షల మంది విదేశీ విద్యార్థులకు కష్టాలు ఆరంభమయ్యాయి. అమెరికా ప్రభుత్వ తాజా నిర్ణయం 3 లక్షల 60 వేల మంది భారతీయ విద్యార్థులపై తీవ్ర ప్రభావాన్ని చూపించనుంది. ఈ నేపథ్యంలో అమెరికా ఇమ్మిగ్రేషన్ ఆంక్షలు.. భారతీయ విద్యార్థుల్లో ఉన్న ఆందోళనపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది.