సబ్బుపై అందంగా అబ్దుల్ కలాం చిత్రం - కలామ్ బొమ్మను సబ్బు పై చిత్రించిన దేవిన శ్రీనివాస్
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-9180148-880-9180148-1602748172634.jpg)
జననం సాధారణమైనదే కావచ్చు... మరణం గొప్ప చరిత్ర సృష్టించేదిగా ఉండాలి..., కలలు కనండీ..వాటిని సాకారం చేసుకోండి...ఇలా ఎన్నో స్ఫూర్తీనిచ్చే వాక్యాలు అందించిన మహనీయుడు ఏపీజే అబ్దుల్ కలాం. శాస్రవేత్తగా ఆయన అందించిన సేవలకుగాను దేశ ప్రజలు ముద్దుగా మిసైల్ మ్యాన్‌గా పిలుచుకుంటారు. అంతేకాక, దేశ అత్యున్నత పదవి అయిన రాష్ట్రపతిగా ఎనలేని సేవలు అందించారు. ఎంతో మంది యువతకు ఆ మహనీయుని జీవితం ఆదర్శప్రాయం. నేడు ఆ ప్రజామనిషి జయంతి పురస్కరించుకొని తూర్పుగోదావరి జిల్లా రంగంపేటకు చెందిన కళాకారుడు శ్రీనివాస్... సబ్బుపై కలాం బొమ్మ తీర్చిదిద్దారు.