తిరుమల.. నిర్మానుష్యమైందిలా..! - తిరుమలకు లాక్ డౌన్ ఎఫెక్ట్ వార్తలు
🎬 Watch Now: Feature Video
నిత్యం లక్షలాది మంది యాత్రికులు సందర్శించే తిరుమల.. ఇప్పుడు నిర్మానుష్యమైంది. భక్తుల గోవింద నామ స్మరణలతో మారుమ్రోగే క్షేత్రంలో ఇప్పుడు నిశ్శబ్ధం రాజ్యమేలుతోంది. ఇప్పటి వరకు కనీవినీ ఎరుగని రీతిలో సప్తగిరుల క్షేత్రం సందడి లేకుండా పోయింది. భక్త జన సంచారం లేని కారణంగా... తిరుమల కొండపై వన్యప్రాణుల సంచారం అధికమైంది. స్వామివారికి నిర్వహించే కైంకర్యాలన్నింటినీ ఏకాంతంగా నిర్వహిస్తున్నప్పటికీ... భక్తులు రాకపోవడంతో తిరుమల కళ తప్పింది.