ప్రతిధ్వని: అమెరికాలో ఆగ్రహ జ్వాలలపై చర్చ - అంతర్జాతీయ తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video
'ఐ కాంట్ బ్రీత్' అనే నినాదంతో అమెరికా అట్టుడుకుతోంది. ఆఫ్రో-అమెరికన్ జార్జి ఫ్లాయిడ్ మెడను ఓ పోలీస్ అధికారి మోకాలుతో తొక్కిపెట్టి ప్రాణాలు తీసిన ఘటనకు నిరసనగా అగ్రరాజ్య వీధులు రణరంగాన్ని తలపిస్తున్నాయి. సైన్యాన్ని రంగంలోకి దింపుతానన్న అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలు.. ఎగిసిపడుతున్న నిరసన జ్వాలలకు ఆజ్యం పోసినట్లయ్యాయి. సొంత పౌరులపైనా సైన్యాన్ని మోహరిస్తానన్న అగ్రరాజ్యాధిపతిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు నిరసనలే తమ దేశ బలమని.. వాటిని అణిచివేయాలనుకుంటున్న వారికి అమెరికా అంటే అర్థం తెలియదని.. ఆ దేశ మాజీ అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్ విమర్శలు గుప్పించారు. ఈ అంశంపై ఈటీవీ ప్రతిధ్వని ప్రత్యేక చర్చ..