Sand Sculpture to Mark International Day of Girls Child: అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకుని సైకత శిల్పం
🎬 Watch Now: Feature Video
Sand Sculpture to Mark International Day of Girls Child : అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకుని సైకత శిల్పాన్ని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన దేవిన సోహిత, ధన్యతలు రూపొందించారు. బాలికలు, మహిళలపై జరిగే అకృత్యాలు ఆగడం లేదని.. నిందితులకు తేలికైన శిక్షలే విధిస్తున్నారనే నినాదంతో.. ఓ బాలికను పిడికిలితో చిదిమేస్తున్నట్లుగా సైకతాన్ని తీర్చిదిద్దారు.
జిల్లాలోని రంగంపేటలో ఉంటున్న సైకత శిల్పి దేవిన శ్రీనివాస్ కుమార్తెలు దేవిన సోహిత, దేవిన ధన్యతలు.. అక్టోబరు 11న అంతర్జాతీయ బాలికా దినోత్సవం పురస్కరించుకొని సైకత శిల్పాన్ని రూపొందించారు. దేవిన ధన్యత మాట్లాడుతూ.. మహిళలు, బాలికలు నిత్యం ఏదో ఒకచోట రకారకాల హింసలకు గురువుతున్నారు. ఆడ పిల్లల కోసం అనేక రకాల చట్టాలు ఉన్నాయి. కానీ, ఆ చట్టాల్లోని చిన్న లోపాలను ఉపయోగించుకుని శిక్షల నుంచి తప్పించుకుంటున్నారు. లేకపోతే తక్కువ శిక్షలతో బయట పడుతున్నారని ధన్యత అన్నారు. ఇటువంటి నేరాలకు పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షిస్తే ఇలాంటి అగత్యాలు జరగకుండా ఉంటాయని అన్నారు.