Pratidhwani: ధాన్యం సొమ్ము అందేదెప్పుడు..? వరి రైతు ఎదురుచూపులు ఇంకెన్నాళ్లు..? - ఏపీలో వరి కొనుగోళ్లు
🎬 Watch Now: Feature Video
రైతుకు బకాయిలు ఇచ్చేదెన్నడు..? వర్షాలు, వరదలు, చీడపీడలు, ఇలా ఎన్నో కష్టాలు దాటి.. చేతికొచ్చిన అరకొర పంట అమ్ముకున్నాక ఎదురవుతున్న అవస్థలివి. నెలలు గడుస్తున్నా.. కష్టార్జితం మాత్రం అందడం లేదు. ఖరీఫ్ ధాన్యం డబ్బులు.. ఇప్పటికీ ప్రభుత్వం పూర్తిస్థాయిలో చెల్లించకపోవడంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఇదే విషయంపై చాలా రోజులుగా విపక్షాలు, రైతుసంఘాలు ఆందోళనలు చేస్తున్నాయి. కొన్నిచోట్ల ఆర్బీకేల్లో ధాన్యం అమ్మినా.. రైతు వివరాలు పోర్టల్‌లోకి ఎక్కకపోవడం ఆవేదనకు గురి చేస్తోందని అంటున్నారు. అలాంటి సమస్య లేదని ప్రభుత్వం తోసి పుచ్చుతున్నా.. నిత్యం ఎక్కడోచోట ఈ ఆందోళనలు కొసాగుతూనే ఉన్నాయి. అసలు రాష్ట్రంలో ధాన్యం రైతుల పరిస్థితి ఏమిటి..? ఇదే అంశంపై నేటి "ప్రతిధ్వని".
Last Updated : Feb 3, 2023, 8:18 PM IST