Prathidwani: ఉపాధిహామీ పథకంలో ఏం జరుగుతోంది ?.. బకాయిలు పేరుకు పోవడానికి కారణమేంటి ? - నేటి ప్రతిధ్వని
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-14685727-467-14685727-1646841229013.jpg)
రాష్ట్రంలో ఉపాధిహామీ పథకానికి సంబంధించి.. అసలేం జరుగుతోంది..? కష్టంలో ఉన్న పేదలకు అండగా నిలవాల్సిన కార్యక్రమం కొంతకాలంగా వివాదాలకు ఎందుకు కేంద్రబిందువుగా మారుతోంది. రాష్ట్రంలో ప్రస్తుత బిల్లుల చెల్లింపుల విషయంలోనూ ఈ పథకం ప్రస్తావన వస్తోంది. ఉపాధి పనులు చేసిన ఎంతోమంది గుత్తేదారులకు చెల్లించాల్సిన బకాయిలపై చాలా రోజులుగా కోర్టులో కేసులు నడుస్తున్నాయి. కూలీల చెల్లింపులకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నట్లు విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అసలు పథకం అమల్లో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం చెల్లింపుల విషయంలో ఇంత అపప్రద ఎందుకు మూట గట్టుకోవాల్సి వస్తోంది. వందల కోట్లు బకాయిలు ఎందుకు పేరుకుంటున్నాయి ? ఆ ప్రభావం క్షేత్రస్థాయిలో ఎలా పడుతోంది ? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:19 PM IST