YSRCP Samajika Sadhikara Bus Yatra: 'వైసీపీ పాలనలో జరిగిన సంక్షేమాన్ని ప్రజలకు చెప్పేందుకు ఈ యాత్ర' - YSRCP Samajika Sadhikara Bus Yatra news
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 26, 2023, 10:21 PM IST
YSRCP Samajika Sadhikara Yatra: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాలుగున్నరేళ్ల పాలనలో జరిగిన సంక్షేమాన్ని ప్రజలకు చెప్పేందుకు సామాజిక సాధికారత బస్సు యాత్ర చేస్తున్నామని.. వైఎస్సార్సీపీ మంత్రులు బొత్స సత్యనారాయణ, మేరుగు నాగార్జున తెలిపారు. ఈ యాత్ర ద్వారా తమ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న కుట్రలను ప్రజలకు తెలియజేస్తామన్నారు.
YCP Ministers Comments: శ్రీకాకుళం జిల్లాలోని వైసీపీ కార్యాలయంలో సామాజిక సాధికార యాత్రపై మంత్రి బొత్స, మేరుగు నాగార్జున, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌లు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.''ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు అని చెప్పుకునే వారంతా ఈ బస్సు యాత్రకు మద్దతు ఇవ్వండి. ఎందుకంటే పెట్టేవాడు దొరికాడు. ఈ సమాజానికి పనికొచ్చే నాయకుడు దొరికాడు. జగన్‌ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. దయచేసి మా యాత్రకు మద్దతు ఇవ్వండి. ప్రజలకు జవాబుదారితనం కోసమే ఈ యాత్ర చేపట్టాం. కరెంట్ ధరలు పెరిగిన మాట వాస్తవమే. ఇతర రాష్ట్రాల్లో పెరగలేదా..?, విద్యుత్ కొని తెచ్చి ఇవ్వాలంటే ధరలు పెంచాల్సిందే. ప్రతిపక్షాల అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టాలి. 4 సంవత్సరాల్లో కిడ్నీ రోగుల కోసం మంచినీరు, 200 పడకల కిడ్నీ హాస్పిటల్ తీసుకొచ్చాము. ఈరోజు నుంచి అవినీతిలో మునిగిపోయిన ప్రతిపక్షాల తీరును ప్రజలకు చెప్తాం.'' అని మంత్రులు అన్నారు.