ఆరు పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలి - సంక్రాంతికి టీడీపీ పూర్తి మేనిఫెస్టో : కాలవ శ్రీనివాసులు
🎬 Watch Now: Feature Video
TDP Complete Manifesto Released in Sankranti: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార పార్టీకి నాయకులు, కార్యకర్తలు షాక్ ఇస్తున్నారు. వైసీపీ నేతలు, కార్యకర్తలు ఆ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలోకి చేరుతున్నారు. తాజాగా అనంతపురం జిల్లాలో సోమవారం టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు టీడీపీలోకి చేరారు. ఈ సందర్భంగా కాలువ శ్రీనివాసులు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ప్రకటించిన మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకెళ్లి వారికి వివరించి, అవగాహన కల్పించాలని కోరారు. సంక్రాంతికి టీడీపీ పూర్తిస్థాయి మేనిఫెస్టో విడుదల చేస్తారని తెలిపారు.
YSRCP Leaders Joined in TDP: జిల్లాలో రాయదుర్గం నియోజకవర్గం డి.హిరేహాల్ మండలం పాత హడగలి గ్రామంలో కాలవ శ్రీనివాసులు ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ వైస్ సర్పంచ్‌తో పాటు, 30 కుటుంబాలు సోమవారం వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి చేరారు. వీరికి శ్రీనివాసులు టీడీపీ కండువాలు వేసి ఘన స్వాగతం పలికారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావడం తథ్యమని, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని కాలవ శ్రీనివాసులు తెలిపారు. రాష్ట్రంలో వైసీపీ పాలన పట్ల విసుగు చెందిన ప్రజలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారని అన్నారు.