YSRCP: కుప్పంలో ఉద్రిక్తత.. తెలుగు యువత నేత ఇంటిపై వైసీపీ శ్రేణుల దాడి, వాహనానికి నిప్పు - తెలుగు యువత అధ్యక్షులు ఇంటిపై దాడి
🎬 Watch Now: Feature Video
YSRCP Leaders Attack : చిత్తూరు జిల్లా కుప్పంలో వైసీపీ నేతలు మరోసారి రెచ్చిపోయారు. టీడీపీ నేతలపై వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడటంతో కుప్పంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కుప్పం పట్టణ తెలుగు యువత అధ్యక్షులు బాలు ఇంటిపై వైసీపీకి చెందిన కొందరు దాడికి దిగారు. రాళ్లు, కర్రలతో ఘటనాస్థలానికి చేరుకున్న వైసీపీ శ్రేణులు విధ్వంసం సృష్టించారు. ఇంటిపై దాడి చేయడమే కాకుండా.. ఇంటి ముందు ఉన్న ద్విచక్రవాహనానికి నిప్పు పెట్టి మరో వాహనాన్ని ధ్వంసం చేశారు. నిప్పు పెట్టిన వాహనం మంటల్లో చిక్కుకుని అగ్నికి ఆహుతయ్యింది. దాడికి సంబధించిన వివరాలు తెలుసుకున్న కుప్పం టీడీపీ శ్రేణులు భారీగా బాలు ఇంటికి చేరుకున్నారు. దీంతో వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణ చెలరేగింది. ఆ ఘర్షణతో అక్కడ యుద్ద వాతావరణం నెలకొంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని.. ఇరువర్గాలను చెదరగొట్టారు. వైసీపీ నాయకులు టీడీపీ నాయకులపై, వారి ఇళ్లపై వరస దాడులు చేస్తున్న పోలీసులు పట్టించుకోవటం లేదంటూ.. టీడీపీ నాయకులు ఆందోళనకు దిగారు.