వైసీపీ దాష్టికం - విమర్శించాడని సొంతపార్టీ కార్యకర్త, తండ్రిని కట్టేసి కొట్టిన నేతలు! విడిపించి పంపేసిన పోలీసులు - వైఎస్సార్​సీపీ పార్టీ తాజా వార్తలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 17, 2023, 4:39 PM IST

YSRCP Leader Man Handling in Rakesh Reddy: తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజవర్గంలో వైసీపీలో వర్గ విభేదాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. వైసీపీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య వర్గానికి చెందిన ఎన్​డీసీసీబీ ఛైర్మన్‌ సత్యనారాయణ రెడ్డి, వ్యతిరేక వర్గానికి చెందిన దువ్వూరు రాకేష్‌ రెడ్డి పోటాపోటీగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యేను, సత్యనారాయణను విమర్శించడంతో రాకేష్​ను స్తంభానికి కట్టేసి చిత్రహింసలకు గురి చేయటమే కాకుండా అతడి తండ్రిని కూడా కొట్టారు. తర్వాత డీఎస్పీ, సీఐలు అక్కడికి చేరుకుని అతని కట్లు విప్పి విడిపించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. తిరుపతి జిల్లా వైసీపీ సమన్యయకర్త విజయసాయిరెడ్డి ఫోన్లో స్థానిక రాష్ట్ర కార్యదర్శి గిరిధర్ రెడ్డితో మాట్లాడి హామీ ఇవ్వడంతో వ్యతిరేక వర్గ నేతలు వెనక్కి తగ్గారు. పోలీసుల ఎదుటే నిర్భంధించి కొడుతున్నా వారికి ఏమీ పట్టనట్లు ప్రేక్షకపాత్ర పోషించారని రాకేష్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

నన్ను సత్యనారాయణ రెడ్డి తన ఇంటికి తీసుకుపోయి స్తంభానికి కట్టేసి చిత్రహింసలు పెట్టారు. 2005లోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ, ఉపాధ్యక్షుడిగా పని చేశాను.  వైఎస్సార్​సీపీ కార్యకర్తను, జగన్మోహన్ రెడ్డి అనుచరుడిని అయినా కూడా నాపై ఇంత దారుణానికి పాల్పడ్డారు. పోలీసులు ప్రేక్షకుల మాదిరిగా సినిమా చూసినట్లు చుశారు. -దువ్వూరు రాకేష్‌ రెడ్డి

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.