YSRCP leader Attack on Tahsildar in Santhanuthalapadu: తహశీల్దార్‌పై వైసీపీ నేత దాడి.... తమపై రాజకీయ ఒత్తిళ్లు, దౌర్జన్యాలు పెరిగిపోయాయన్న తహశీల్దార్ - ap latest news
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 20, 2023, 12:20 PM IST
YSRCP Leader Attack on Tahsildar in Santhanuthalapadu : రెవెన్యూ కార్యాలయంలో తహశీల్దార్‌పై వైఎస్సార్సీపీ నేత దాడికి పాల్పడిన ఘటన ప్రకాశం జిల్లా సంతనూతలపాడులో చోటు చేసుకుంది. కందుకూరు ఆర్డీఓ కార్యాలయంలో డీటీగా పని చేస్తున్న లక్ష్మీ నారాయణ రెడ్డి మూడు నెలల క్రితం ఉద్యోగోన్నతిపై సంతనూతలపాడు తహశీల్దార్‌గా వచ్చారు. కొన్నాళ్లుగా ఆయనకు వైసీపీ మండల కన్వీనర్ దుంపా చెంచురెడ్డికి మధ్య పొసగడం లేదు. వివిధ పనుల కోసం ఒత్తిళ్లు పెరగడంతో ఆగస్టు 18న వ్యక్తిగత కారణాల పేరిట తహశీల్దార్ సెలవుపై వెళ్లారు. ఈ నెల 11న తిరిగి విధుల్లో చేరారు.
ఈ క్రమంలో రెవెన్యూ కార్యాలయానికి వచ్చిన చెంచురెడ్డి తమ పనులు ఎందుకు చేయడం లేదంటూ తహశీల్దార్‌తో వాగ్వాదానికి దిగారు. నిబంధనల మేరకే నడుచుకుంటున్నట్లు తహశీల్దార్ చెప్పడంతో ఆగ్రహానికి గురైన చెంచురెడ్డి అధికారి గొంతు పట్టుకుని చెంపపై కొట్టారు. ఘటనపై ఆర్టీవో, కలెక్టర్ కార్యాలయానికి తహశీల్దార్ సమాచారామిచ్చారు. తమపై రాజకీయ ఒత్తిళ్లు ఎక్కువయ్యాయని, దౌర్జన్యాలు పెరిగి పోయాయని లక్ష్మీ నారాయణ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.