YSRCP Flag on Government Office: హవ్వా! ఇదేం విడ్డూరం..! ప్రభుత్వ కార్యాలయంపై వైసీపీ జెండా.. - ysrcp flag on government office in anantapur
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/640-480-18678016-446-18678016-1685952654172.jpg)
YSRCP Flag on Government Office: అనంతపురం జిల్లా కుందుర్పి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం పై జాతీయ జెండాకు బదులు వైసీపీ జెండా రెపరెపలాడుతుండటంతో అన్ని వర్గాల వారు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీనిపై వివిధ పార్టీలు, ప్రజా సంఘాలు వ్యతిరేకించాయి. ఇదేమి చోద్యం అని దుమ్మెత్తి పోస్తున్నారు. మండల రెవెన్యూ కార్యాలయంపై మువ్వన్నెల జెండాకి బదులు ఇలా అధికార పార్టీ జెండా ఎగరవేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఈ కార్యాలయం ముందు జరగే ఒక కార్యక్రమంలో పాల్గొనటానికి వెళ్లిన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి ఉమామహేశ్వరనాయుడు ఈ విషయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా ప్రభుత్వ కార్యాలయంపై వైసీపీ పతాకాన్ని ఎగురవేయాలని జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏమైనా ఉత్తర్వులు ఇచ్చిందా..! అని ఉమామహేశ్వర నాయుడు నిలదీశారు. లేదంటే అధికారుల అత్యుత్సాహమా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో పాలన ఎలా నియంతృత్వ ధోరణిలో కొనసాగుతుందో ఈ ఒక్క ఉదాహరణే చాలని ఉమామహేశ్వర నాయుడు పేర్కొన్నారు.