వైసీపీ నేతల తీరుపై నెల్లూరు వాసుల ఆగ్రహం - ఇందిరాగాంధీవిగ్రహంచుట్టూ ఫ్లెక్సీలు
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 18, 2024, 4:54 PM IST
YSRCP Banners Around Indira Gandhi Statue: వైయస్ఆర్సీపీ నాయకులు రాష్ట్ర రాజకీయ నేతలకు ఇచ్చే ప్రాధాన్యం జాతీయ నాయకులకు ఇవ్వటం లేదని నెల్లూరు జిల్లా వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశ మొదటి మహిళా ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ విగ్రహం చుట్టూ అధికార పార్టీ నేతల ఫ్లెక్సీలు ఏర్పాటు చేయటమే ఈ ఆగ్రహానికి కారణం. నెల్లూరు జిల్లా స్టోన్‌హౌస్ పేట బీవీఎస్ స్కూల్ ఎదురుగా మాజీ ప్రధాని ఇందిరా గాంధీ కాంస్య విగ్రహం ఉంది.
నూతన సంవత్సరం, సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతున్న వైసీపీ నేతల ఫ్లెక్సీలు ఇందిరా గాంధీ విగ్రహం చుట్టూ ఏర్పాటు చేశారు. జాతీయ నాయకురాలి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించాల్సింది పోయి, ఈ విధంగా విగ్రహం చుట్టూ ఫ్లెక్సీలు పెట్టటం ఆమెను అవమానించినట్లే అని నెల్లూరు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరికీ ఆటంకం కలగకుండా, అన్ని నిబంధనలు పాటిస్తూ ప్రతిపక్ష్యాలు కటౌట్లు పెడితే తొలగించే నగరపాలక అధికారులకు ఈ చోద్యం కనిపించటం లేదా అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.