Youth Protest by Hanging Around Neck: జాబు రావాలంటే బాబు రావాలి.. మెడకు ఉరితాళ్లు బిగించుకుని నిరుద్యోగుల నిరసన - Unemployed youth Protest by Hanging Around Neck

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 20, 2023, 7:58 PM IST

Unemployed Youth Protest by Hanging Around Neck: విజయవాడలోని పిన్నమనేని పాలీ క్లినిక్ రోడ్డులో నిరుద్యోగ యువత వినూత్న నిరసన చేపట్టారు. జాబ్ ఎక్కడ జగన్ అంటూ మెడకు ఉరితాళ్లు బిగించుకుని నిరసన తెలిపారు. సంవత్సరాలు వస్తూ పోతూ ఉన్నాయ్ కానీ.. జాబ్ క్యాలెండర్ మాత్రం రావట్లేదంటూ లోకేశ్​ యువగళానికి నిరుద్యోగులు మద్దతు తెలిపారు. గత నాలుగేళ్లలో రాష్ట్రానికి వచ్చిన గ్రూప్, పోలీసు, డీఎస్సీ ఉద్యోగాలు సున్నా అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. జాబు రావాలంటే బాబు రావాలంటూ నిరుద్యోగ యువత యువగళానికి మద్దతు తెలిపారు. 

Lokesh Padayatra Route Map: లోకేశ్​ పాదయాత్ర 189వ రోజైన నేడు విజయవాడ తూర్పు, పెనమలూరు, గన్నవరం నియోజకవర్గాల మీదుగా సాగుతోంది. విజయవాడ తూర్పులో బందరు రోడ్డు, పిన్నమనేని పాలీ క్లినిక్ రోడ్డు, నిర్మలా కాన్వెంట్ రోడ్డు, పటమట ఎన్టీఆర్ సర్కిల్, హైస్కూల్ రోడ్, ఆటోనగర్​ మీదుగా పాదయాత్ర సాగుతోంది. అనంతరం పెనమలూరు నియోజకవర్గంలో కానూరు, తాడిగడప, పోరంకి మీదుగా సాగనుంది. ఆ తర్వాత గన్నవరం నియోజకవర్గంలోకి ప్రవేశించనుంది. రాత్రికి లోకేశ్ నిడమానూరు శివారులో బస చేయనున్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.