Youngman Protest for Road: రోడ్డుపై అడ్డంగా మంచం వేసి.. ఏలూరులో యువకుడి వినూత్న నిరసన - ఏలూరులో యువకుడి వినూత్న నిరస
🎬 Watch Now: Feature Video
Youngman protest On Roads Condition Lying In Bed: ఏలూరులో రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా మారిందని ఓ యువకుడు వినూత్నంగా నిరసన తెలిపాడు. రోడ్డుపై ఏర్పడిన గుంతలోనే మంచం వేసుకుని.. వాహనాలను అడ్డుకుని తన నిరసనను వ్యక్తం చేశాడు. రోడ్లు పూర్తిగా ధ్వంసమై గుంతలు ఏర్పడ్డాయని.. ఆ గుంతలో వర్షపునీరు చేరి చెరువులను తలపిస్తున్నాయని తన ఆవేదనను వ్యక్తం చేశాడు. ఏలూరు నుంచి మాదేపల్లి వెళ్లే రోడ్డులో ఫిల్‌హౌస్‌పేట వద్ద ఓ యువకుడు.. రోడ్డుపై నిలిచిన నీటిలో మంచం వేసుకుని పడుకున్నాడు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోవటం లేదని.. అక్కడి నుంచి కదిలేదే లేదని భీష్మించుకుని మంచంపై పడుకున్నాడు. అదే సమయంలో అటుగా వచ్చిన ఆర్టీసీ బస్సును ముందుకు కదలనీయకుండా అడ్డుకున్నాడు. రోడ్లు వేయాలంటూ నినాదాలు చేశాడు. సుమారు గంట వరకు ఇతే తతంగం నడవటంతో.. గ్రామస్థులే ఆ యువకుడికి సర్ది చెప్పి, అక్కడి నుంచి పక్కకు తీసుకువచ్చారు. దీంతో అక్కడి నుంచి వాహనాలు ముందుకు కదిలాయి.