Young Man Brutally Murdered Due to Extra Marital Affair: ఇంటికి పిలిచి యువకుడి దారుణ హత్య.. మహిళతో చనువే కారణమా..? - AP Crime News

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 11, 2023, 4:03 PM IST

Young Man Brutally Murdered Due to Extra Marital Affair: ఈ రోజుల్లో వివాహేతర సంబంధాలు.. దాంపత్య బంధాన్ని కడతేర్చుతున్నాయి. ఓ వైపు ఆ మోజులో పడి కట్టుకున్న వాడిని.. కడుపున పుట్టిన వాళ్లను సైతం హత్య చేయడానికి సిద్ధమవుతున్నారు. ఆ తర్వాత జరిగే పరిణామాలు తెలిసినా.. క్షణిక సుఖాల కోసం కుటుంబాలను వీధిపాలు చేస్తున్నారు. తద్వారా జీవితాలను అంధకారం చేసుకుంటున్నారు. వివాహేతర సంబంధాలు కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తున్నాయనడానికి ఈ ఘటనే ఓ ఉదాహరణ. 

ఓ యువకుడిని కిరాతకంగా హతమార్చిన ఘటన బాపట్ల జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. చీరాల మండలం వాడరేవుకు చెందిన ఎం. సూరిబాబు అనే యువకుడు అదే గ్రామానికి చెందిన ఒక వివాహితతో చనువుగా ఉంటున్నాడని ఆమె భర్త, బంధువులు కలిసి పథకం ప్రకారం సూరిబాబును ఇంటికి పిలిచి కర్రలు, రాడ్లుతో కొట్టి చంపారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుని అక్క ఏలియమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు చీరాల రూరల్ సీఐ మల్లికార్జునరావు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.