Aditya Rocket experiments: రాకెట్ ప్రయోగంలో తెలుగు యువకుడి ప్రతిభ.. 32మందికి లీడర్ - ETV Bharat Yuva Stories
🎬 Watch Now: Feature Video
Young man excelled in the rocket launch: రాకెట్ ప్రయోగాలపై యువతలో ఆసక్తి పెరుగుతోంది. అందరికంటే భిన్నంగా రాకెట్ ప్రయోగాలు చేస్తూ ఔరా అనిపిస్తున్నారు. అలాంటి ఓ యువకుడే విజయవాడకు చెందిన ఈడుపుగంటి ఆదిత్య. మద్రాస్ ఐఐటీ తరఫున ప్రతిష్ఠాత్మక స్పెస్‌పోర్ట్ అమెరికా కప్‌లో చేతక్-1 రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించి ప్రంశసలు అందుకున్నాడు. మద్రాస్ ఐఐటీలోని 32మంది విద్యార్థుల బృందానికి నాయకుడిగా ఉత్తమ ప్రదర్శన కనబరిచాడు ఆ యువకుడు. మద్రాస్ ఐఐటీ బృందం ప్రయోగించిన చేతక్-1 రాకెట్ 10వేల అడుగుల దూరంతో నింగిలోకి దూసుకెళ్లింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కళాశాలల, విశ్వవిద్యాలయాల నుంచి 150కిపైగా బృందాలు పాల్గొన్న స్పేస్‌పోర్ట్ అమెరికా కప్‌లో చేతక్ - 1 పేరుతో రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించి- అందరి ప్రశంసలు అందుకున్నారు. మద్రాస్ ఐఐటీ చరిత్రలో చేతక్-1 ప్రయోగం కొత్త శకానికి నాంది పలికినట్లు అయిందని అంటున్నాడు టీం లీడర్ ఆదిత్య. మరి చేతక్-1 రాకెట్ కోసం అతడెలా శ్రమించాడు.. బృంద నాయకుడిగా అతడెలా సమన్వయం చేసుకున్నాడు? అతడి లక్ష్యం ఏంటి? ఇలాంటి మరిన్ని విషయాలను మద్రాస్ ఐఐటీ అభ్యుదయ్ టీం లీడర్ ఆదిత్య మాటల్లో విందాం.