Young Entrepreneur Spandana in Visakha: స్పా ఉత్పత్తుల బిజినెస్.. దక్షిణ భారతంలో తొలి మహిళా వ్యాపారి - విశాఖ లేటెస్ట్ న్యూస్
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 7, 2023, 8:34 PM IST
Young Entrepreneur Spandana in Visakha: స్పా ఉత్పత్తులతో వ్యాపారమా.. అది కూడా ఒక అమ్మాయి.. ఏంటి ఇదంతా అన్నారు తెలిసినవారంతా. కానీ తాను మాత్రం ఎక్కడ తగ్గలేదు. అనుకున్నదే లక్ష్యంగా దాచుకున్న 2 వేల రూపాయలతో చిన్నగా వ్యాపారం మెుదలు పెట్టి.. ప్రస్తుతం 150 స్పాలకు ఉత్పత్తులను అందించే స్థాయికి ఎదిగింది. దాంతో దక్షిణ భారతంలోనే ఈ రకమైన బిజినెస్ చేస్తున్న తొలి మహిళగా గుర్తింపు పొందింది విశాఖకు చెందిన కుసుమ స్పందన రెడ్డి. రెండు వేల రూపాయలతో మొదలుపెట్టిన తన వ్యాపారంలో ఇప్పుడు రూ.లక్షల్లో లాభాలను ఆర్జిస్తోంది. స్పా ఉత్పత్తుల వ్యాపారంలో ఎదిగి చూపిస్తూ.. తనను విమర్శించినవారికి దీటైన సమాధానం ఇస్తోంది. మరి అనుకోకుండా వ్యాపారంలోకి అడుగుపెట్టిన తనను ప్రోత్సాహిస్తోంది ఎవరు? రెండు పదుల వయసు కూడా లేని తనకు ఇదంతా ఎలా సాధ్యమైంది.? తన సక్సెస్ వెనుకున్న అసలు కథ ఏంటో ఆ యువ వ్యాపారవేత్తనే అడిగి తెలుసుకుందాం పదండి.