YCP Sarpanchs and MPTCs Protest in Mandal Plenary Meeting: గ్రామ పంచాయతీ నిధులు మళ్లీస్తున్నారని.. వైసీపీ సర్పంచులు, ఎంపీటీసీల నిరసన

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 29, 2023, 8:00 PM IST

YCP Sarpanchs and MPTCs Protest in Mandal Plenary Meeting on 15th Finance Commission Funds: అనకాపల్లి జిల్లాలో మునగపాక మండలానికి చెందిన వైసీపీ సర్పంచులు ఎంపీటీసీలు మండల సర్వసభ్య సమావేశంలో నిరసన వ్యక్తం చేశారు. ఎంపీటీసీలను, సర్పంచులను ఉత్సవ మూర్తులుగా ప్రభుత్వం మారుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మునగపాక మండలంలో సర్వసభ్య సమావేశం నిర్వహించగా.. ఆ సమావేశంలో పాల్గొన్న సర్పంచులు, ఎంపీటీసీలు అధికారుల ముందు నిరసన చేపట్టారు. 

ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు అందిస్తున్న 20 లక్షల రూపాయలను.. తమ ప్రమేయం లేకుండా ఖర్చు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వాటిపై ప్రశ్నిస్తే తమను దొంగలుగా చూస్తున్నారని దుయ్యబట్టారు. తమ ప్రమేయం లేకుండా 15వ ఆర్థిక సంఘం నిధులను ఎలా విద్యుత్​ బకాయిలకు జమ చేస్తారని వారి నిరసన గళాన్ని అధికారులకు వినిపించారు. స్థానిక సంస్థలను బలోపేతం చేయాలని కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేస్తోంది. అయితే ఇలా విడుదల చేసిన నిధులను.. రాష్ట్ర ప్రభుత్వం కరెంటు బిల్లుల పేరుతో గ్రామ పంచాయతీల ఖాతాల నుంచి లాగేసుకుంటోందని ప్రతిపక్షాలు విమర్శిస్తూనే ఉన్నాయి.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.