వారి ఓట్లు తొలగించండి - వైసీపీ కార్యకర్తలకు ఎమ్మెల్యే శంకర్రావు సూచనలు - ఆడియో లీక్ - ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు టీడీపీ కామెంట్స్
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 25, 2023, 10:32 PM IST
YCP MLA Namburi Shankarrao audio leak: పల్నాడు జిల్లా పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు ప్రజలకు ప్రజాస్వామికంగా వచ్చిన ఓటుహక్కును కాలరాస్తున్నారని మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుల ఓట్ల తొలగించాలని ఎమ్మెల్యే శంకర్రావు మాట్లాడిన ఆడియోను కొమ్మాలపాటి శ్రీధర్ మీడియాకు విడుదల చేశారు. టీడీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగించేందుకు ఫాం 7 పెట్టాలని వైసీపీ నేతలకు శంకర్రావు సూచించారు. ఆ గ్రామంలో కులాల వారిగా ఓట్ల లెక్కలు చెప్పటంపై ఆశ్ఛర్యం వ్యక్తం చేశారు. కులగణన జరగకుండానే కులాల వారీగా ఓట్ల వివరాలు ఎలా తెలిశాయని కొమ్మాలపాటి ప్రశ్నించారు.
కాపుల ఓట్లు టీడీపీ, జనసేన కూటమికి పడతాయని భయపడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. అందుకోసమే ఆ వర్గం వారి ఓట్లు తీసేయాలని తన వారికి చెబుతున్నారని ఆరోపించారు. అదే సమయంలో... వైసీపీ సానుభూతిపరులు వేరే చోట ఉన్నా, వారి ఓట్లు చేర్చాలని చెప్పడమేంటని ప్రశ్నించారు. వైసీపీ ఓట్ల తొలగింపుపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఇలాంటి వ్యక్తులు రాజకీయాలను అపహాస్యం చేస్తున్నారని కొమ్మాలపాటి మండిపడ్డారు.