'ప్రజలకు మా చేతులమీదుగా పథకాలు ఇవ్వలేకపోతున్నాం' - అధికార పార్టీ ఎమ్మెల్యే అసంతృప్తి - పాయకరావు పేట వైసీపీ
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 9, 2023, 12:32 PM IST
YCP Leaders Said Unsatisfied In Party : వైసీపీ నేతలు తమ పార్టీ పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. పాయకరావు పేటలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో పలువు పార్టీ నేతలు వారి అసంతృప్తిని వెలిబుచ్చారు. వైసీపీలో తాను కూడా నిరాశ, నిస్పృహలతో ఉన్నానని ఎమ్మెల్యే గొల్ల బాబూరావు అన్నారు. ప్రజలకు తమ చేతుల మీదుగా పథకాలు ఇవ్వలేకపోతున్నామనే నిరాశ ప్రజాప్రతినిధులు, కార్యకర్తల్లో ఉందని వైసీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ అన్నారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట వైసీపీలో మరోసారి వర్గవిభేదాలు రచ్చకెక్కాయి. వైసీపీ విస్తృత స్థాయి సమావేశం వేదికగా నాయకులు అంతృప్తిని వెల్లగక్కారు. నేరుగా ఎమ్మెల్యే బాబూరావు సైతం పార్టీపై అసమ్మతిని వ్యక్తం చేయడం చర్చనీయాంశమైంది.
YCP MLA Babu Rao in Anakapally Meeting : తమ సొంత గ్రామాల్లో కూడా ఎటువంటి అభివృద్ధి పనులు చేయించలేకపోతున్నామని నేతలు అసహనం వ్యక్తం చేశారు. ప్రజలకు సమాధానం చెప్పలేకపోతున్నామని నేతలంతా గళం వినిపించారు. కార్యకర్తల్లో నిరాశ, నిస్పృహలు ఉన్నమాట వాస్తవమేనన్నారు. ఈ సమావేశాలకు అధికార పార్టీకి చెందిన కొంతమంది సర్పంచులు, ఎంపీటీసీలు డుమ్మా కొట్టారు.