'చెట్లు తొలగింపు సాకుతో ఇళ్లు కూల్చేస్తున్నారు' : విజయవాడలో ప్రజల ఆందోళన - AP Latest News
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 30, 2023, 4:44 PM IST
YCP Leaders Removing Poor Houses in Vijayawada : తాత ముత్తాతల కాలం నుంచి వడ్రంగి పని చేసుకుంటూ జీవిస్తున్న.. తమ ఇళ్లను తొలగించాలని వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని వడ్రంగి కార్మికులు ఆరోపించారు. విజయవాడ పూర్ణానందంపేట సీఆర్ రెడ్డి రోడ్డులో రహదారి పక్కన దశాబ్దాలుగా నివాసం ఉంటున్న స్థానికులను ఖాళీ చేయించేందుకు చెట్లను తొలగిస్తున్నామనే సాకుతో.. తమ ఇళ్లపై చెట్లును కూల్చుతున్నారని స్థానికులు ఆరోపించారు. రైల్వే స్టేషన్కు కొద్ది దూరంలో ఉన్న స్థలాన్ని కబ్జా చేసేందుకు వైసీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారని అందులో భాగంగా.. తమను ఖాళీ చేయించేందుకు చెట్ల తొలగింపు పేరుతో ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఇబ్బందు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎన్నికల సమయంలో ఓట్ల కోసం తమ వద్దకు వచ్చిన నాయకులు ఒక్కరు కూడా ఇప్పుడు తమను ఆదుకునేందుకు రాలేదని మండిపడ్డారు. ఏళ్ల తరబడి నివాసం ఉంటున్న తమకు ఇక్కడే స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కరెంటు స్తంభాలకు చెట్లు అడ్డుగా వస్తున్నాయని తొలగిస్తున్నాము.. అంతేకానీ వారిని ఖాళీ చేయించే ప్రయత్నం చేయడం లేదని సీఐ వెంకటరమణ చెప్పారు. చెట్లను తొలగించే ప్రయత్నంలో ఒక చెట్టు ఇంటిపై పడి రేకులు దెబ్బతిన్నాయని స్థానికులు ఆందోళనకు దిగారన్నారు. స్థానికులతో మాట్లాడి ఆందోళనను విరమింప చేశామని సీఐ తెలిపారు.