'ఆ ఎమ్మెల్యేకు మళ్లీ టికెట్ ఇస్తే ఓడిస్తాం' - అధిష్ఠానానికి వైసీపీ కార్యకర్తల హెచ్చరిక - జగన్ పై వైసీపీ
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 27, 2023, 7:44 PM IST
YCP Leaders Protest: పల్నాడు జిల్లా నరసరావుపేట వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి, 2024 ఎన్నికల్లో టికెట్ ఇవ్వొద్దంటూ వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. గోపిరెడ్డికి వ్యతిరేకంగా వైసీపీ నేతలు, కార్యకర్తలు తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. సేవ్ నరసరావుపేట అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. కేంద్ర కార్యాలయం ఎదుట బైఠాయించి గోపిరెడ్డి శ్రీనివాసులరెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గోపిరెడ్డికి వ్యతిరేకంగా బ్రహ్మారెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు ర్యాలీగా తాడేపల్లికి చేరుకున్నారు. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి ఈసారి టికెట్ ఇవ్వొద్దని బ్యానర్లను ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు.
గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ముఠా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపించారు. నియోజకవర్గాన్ని సర్వనాశనం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి సీట్లు ఇస్తున్నారని ఆరోపించారు. ప్రశ్నిస్తే తమపై దాడులు జరుగుతున్నాయని తెలిపారు. గోపిరెడ్డికి కాకుండా ఎవ్వరికి టికెట్ ఇచ్చినా వైసీపీ కోసం పనిచేస్తామని పేర్కొన్నారు. గోపిరెడ్డి అన్నదమ్ములు, కుటుంబాల మధ్యగొడవలు సృష్టిస్తున్నారని వైసీపీ కార్యక్తలు ఆరోపించారు. గోపిరెడ్డికి టికెట్ ఇస్తే ఓటమి ఖాయమని హెచ్చరించారు. ఇప్పటికైనా సీఎం జగన్ స్పందించి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి టికెట్ విషయంలో సరైన నిర్ణయం తీసుకోవాలని పేర్కొన్నారు.