టీడీపీ సానుభూతిపరులపై వైఎస్సార్సీపీ రౌడీ మూకల దాడి - ఇళ్లల్లోకి చొరబడి సామగ్రి ధ్వంసం - AP Latest News
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 18, 2023, 11:34 AM IST
YCP Leaders Attack TDP Sympathizers House: గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం గారపాడులో టీడీపీ కార్యకర్తల ఇంటిపై వైఎస్సార్సీపీ వర్గీయులు దౌర్జన్య కాండకు దిగారు. పొలం కౌలు విషయంలో చెలరేగిన వివాదం ఇళ్లపై దాడి చేసే వరకు వెళ్లింది.
చమళ్లమూడి, కాట్రపాడు, గారపాడు గ్రామాల నుంచి 40 మంది వైఎస్సార్సీపీ కార్యకర్తల గారపాడు ఎస్సీ కాలనీలో టీడీపీ కార్యకర్తల ఇంట్లోకి వెళ్లి సామగ్రి ధ్వంసం చేశారు. రహదారిలో కనిపించిన టీడీపీ కార్యకర్తలను ఆపి వారిపై దాడికి పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి రామాంజనేయులు ఛలో గారపాడు కార్యక్రమం నిర్వహించారు. అక్కడకు వెళ్లి బాధితులను పరామర్శించారు. అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని బతికామని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో గత ఆరు నెలలుగా ఘర్షణలు జరగడంతో పోలీస్ పికెట్ నడుస్తోంది. అయినప్పటికీ రౌడీ మూకలు ఈ విధంగా దాడులు చేయడం ఏంటని రామాంజనేయులు ప్రశ్నించారు. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేశారు.