YCP Leaders Attack TDP Followers in Ponnur : ఫ్లెక్సీలు చించివేశారంటూ వైసీపీ నేతల దాడి.. ముగ్గురు మహిళలకు గాయాలు - ఏపీ తాజా వార్తలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 1, 2023, 4:32 PM IST

YCP Leaders Attack TDP Followers in Ponnur : గుంటూరు జిల్లా పొన్నూరు మండలంలో తాము ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు చిరిగిపోవడానికి టీడీపీ కార్యకర్తలే కారణమంటూ వైసీపీ నేతలు దాడి చేశారు. ఈ దాడిలో ముగ్గురు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స కోసం పొన్నూరు వైద్యశాలకు తరలించారు.  

పొన్నూరు మండలంలోని మామిళ్లపల్లిలో గ్రామంలో ఆగస్టు 31న (గురువారం) 'గడపగడపకు మన ప్రభుత్వం' కార్యక్రమాన్ని వైసీపీ నాయకులు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ముస్లిం పేటలో వైసీపీ కార్యకర్తలు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. కొద్ది సేపటికి.. వారు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు చిరిగిపోయి ఉన్నాయి. ఆ ఫ్లెక్సీలను అదే సామాజిక వర్గానికి చెందిన టీడీపీ కార్యకర్తలే చించివేశారంటూ వారిపై దాడి చేశారు. ఈ దాడిలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని తొలుత పొన్నూరు వైద్యశాలకు తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం అక్కడ నుంచి గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.