YCP Leader Faced Bad Experience: గడప కార్యక్రమంలో వైసీపీ నేతకు చేదు అనుభవం.. నవ్వుతూనే చురకలంటించిన చేనేత కార్మికుడు - బంగారుపేటలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 20, 2023, 4:27 PM IST
YCP Leader Faced Bad Experience ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరిలో వైసీపీ ఇంఛార్జ్‌కు చేదు అనుభవం ఎదురైంది. గడప కార్యక్రమంలో పాల్గొన్న ఇంఛార్జ్‌కు.. ఓ చేనేత కార్మికుడు నవ్వుతూనే చురకలు అంటించారు. బంగారుపేటలో 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమంలో నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జ్ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఓ ఇంటికి వెళ్లాడు. అర్హుడైన తనకు నేతన్న నేస్తం రాలేదని చేనేత కార్మికుడు అసహనం చెందారు. వైసీపీ ప్రభుత్వంలో తమకు ఎలాంటి పథకాలు రాలేదని నేదురుమల్లి ముందరే అసహనం వ్యక్తం చేశాడు చేనేత కార్మికుడు. వాలంటీర్లు దొంగ వేలిముద్రలు వేసి డబ్బు కొట్టేయడానికి యత్నిస్తున్నారంటూ నేతన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. వాలంటీర్ల వల్ల వెంకటగిరిలో వైసీపీ ఇంఛార్జ్ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి, రాష్ట్రంలో సీఎం జగన్మోహన్ రెడ్డికి వచ్చే ఎన్నికల్లో ఓటమి ఖాయమని చేనేత కార్మికుడు.. వారి ముఖానే చెప్పారు. దీంతో వైసీపీ నాయకులుకు ఇబ్బందిగా నెమ్మదిగా అక్కడినుంచి జారుకున్నారు.