అధిక వడ్డీ ఆశిస్తే ₹12కోట్లతో ఉడాయించిన మహిళ - బాధితులంతా పోలీస్ కానిస్టేబుళ్ల భార్యలే - గుంటూరు జిల్లా మంగళగిరి పోలీసులు
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 19, 2023, 1:01 PM IST
Woman Escape With 12 Crores Of Police Money: గుంటూరు జిల్లా మంగళగిరిలో శ్రీరామ్ నగర్ కాలనీకి చెందిన శ్రీదేవి అనే మహిళ 12 కోట్ల రూపాయలతో ఉడాయించినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. డీజీపీ, ఆక్టోపస్, ఆరో బెటాలియన్‌కు చెందిన సిబ్బంది వద్ద 2016 నుంచి శ్రీదేవి చిట్టీలు నిర్వహిస్తుంది. ఈమె వద్దే చిట్టీ పాటలు పాడుకొని మళ్లీ ఆమెకే కానిస్టేబుల్ భార్యలు వడ్డీకి డబ్బులు ఇచ్చేవారు. 70మంది పోలీస్ కానిస్టేబుల్ భార్యల నుంచి సుమారు 12 కోట్లు వరకు వసూలు చేసి మొత్తం తీసుకుని రాత్రికి రాత్రే పరారైందని తెలిపారు. వెంటనే మంగళగిరి గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఆరో బెటాలియన్‌కు చెందిన కానిస్టేబుల్ భార్య సుష్మకుమారి రిపోర్టు ఇచ్చారు. శ్రీదేవి దగ్గర చిట్టీలు వేసి అందరం మోసపోయామని తెలిపారు. దాదాపు 60 నుంచి 70మంది పోలీసుల వరకు నష్టపోయారు. శ్రీదేవిని డబ్బులు అడుగుతుంటే ఇచ్చేస్తానంటూ మాయ మాటలు చెప్పి పరారైంది. సుమారు 10-12కోట్ల రూపాయల వరకు నష్టపోయారు. - క్రాంతి కిరణ్, ఎస్సై, మంగళగిరి