Woman Complaint on YSRCP Leader: 'నా భూమిని వైసీపీ నేతలు ఆక్రమించారు'.. దళిత మహిళ కన్నీటిపర్యంతం - Dalit woman land encroached by YCP ZPTC
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 4, 2023, 8:55 PM IST
Woman Complaint on YSRCP Leader in Kakinada District : వైసీపీ నేతల భూ ఆక్రమణలకు అడ్డూ అదుపూ లేకుండా పోతుంది. కనిపించిన ప్రతి స్థలాన్ని కబ్జా చేస్తున్నారు. తాజాగా తమ భూమిని ఆక్రమించారంటూ ఓ దళిత మహిళ కన్నీరు పెట్టుకుంది. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలులో దళిత మహిళ వీరబుల్లి స్థలాన్ని స్థానిక వైసీపీ జడ్పీటీసీ సభ్యుడు లోవరాజు అతని అనుచరులు కబ్జా చేశారని.. తన భూమిని వారి నుంచి విడిపించాలని కలెక్టర్కు బాధితురాలు విన్నవించారు. తండ్రి నుంచి సంక్రమించిన 85 సెంట్ల భూమిని 40 ఏళ్లుగా మామిడి, జీడీ తోట పండించుకొని కుటుంబాన్ని పోషించుకుంటున్నామని చెప్పారు. ఈ భూమిని జడ్పీటీసీ లోవరాజు కబ్జా చేసుకొని తమను బెదిరిస్తున్నారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్య పరిష్కరించాలని ఉన్నతాధికారులకు విన్నవించామని.. స్థానిక తహసీల్దార్ సమస్య పరిష్కరించడం లేదని వాపోయారు. తమకు నలుగురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారని.. జీవనాధారమైన భూమిని కబ్జాదారుల నుంచి తిరిగి అప్పగించాలని ఎస్సీ మహిళ వీరబుల్లి కలెక్టర్కు విన్నవించారు.