Vundavalli Sridevi Comments on YSRCP: వైసీపీ కోసం ఎంతో కష్టపడ్డా.. అయినా రోడ్డున పడేశారు: ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి - Vundavalli Sridevi Comments on CBN
🎬 Watch Now: Feature Video
Vundavalli Sridevi Comments on YSRCP: అమరావతి రైతులకు వైసీపీ బహిష్కృత నేత తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఆమె మద్దతు తెలిపారు. రాజధాని అమరావతిలోనే ఉంటుందని చెప్పి.. రాజధాని రైతులను తాను కూడా మోసం చేసినట్లు ఆమె వివరించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రలో.. ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పాల్గొన్నారు. అమరావతి ఆవేదన పేరుతో రాజధాని రైతులతో లోకేశ్ సమావేశం నిర్వహించగా.. ఈ కార్యక్రమానికి శ్రీదేవి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. శ్రీదేవి ఎలా తిరుగుతుందో చూస్తామని కొందరు అన్నారని.. ఈ కార్యక్రమానికి అహ్వానించి లోకేశ్ కొండంత భరోసానిచ్చారని అన్నారు. వైసీపీ కోసం తాను ఎంతో కష్టపడ్డానని.. అయినప్పటికీ రోడ్డున పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యకర్తలతో ఫోన్లు చేయించి.. అనేక విధాలుగా వేధించారని కంటతడి పెట్టుకున్నారు. నేను లోకేశ్‌ను ఎప్పుడూ చూడలేదని.. ఆయన నాకు మద్దతిస్తానని అన్నారని వివరించారు. అందుకు లోకేశ్‌కు మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని సంతోషం వ్యక్తం చేశారు. అమరావతి అంటే చంద్రబాబు, లోకేశ్ అని అన్నారు. అమరావతి రైతులు ధైర్యంగా ఉండాలని.. వారిద్దరూ ఎట్టి పరిస్థితుల్లోనూ రైతుల వెన్నంటే ఉంటారని స్పష్టం చేశారు.