VPA Projects Inauguration by PM Modi: 'విశాఖ పోర్టు ఆధునీకరణ'.. మూడు బెర్త్‌ల యాంత్రీకరణ పనులు ప్రారంభించిన ప్రధాని మోదీ - VPA Projects Inauguration
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 17, 2023, 5:32 PM IST
VPA Projects Inauguration by PM Modi: విశాఖపట్నం పోర్టు అథారిటీకి (Visakhapatnam Port Authority) సంబంధించిన ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులకు ప్రధాని నరేంద్ర మోదీ దిల్లీ నుంచి వర్చువల్‌గా శ్రీకారం చుట్టారు. ముంబైలో కేంద్రం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్ మారీటైం ఇండియా సమ్మిట్ 2023ను (Global Maritime India Summit 2023) ప్రారంభించిన ప్రధాని.. దేశంలోని మేజర్ పోర్టులకు సంబంధించిన ప్రాజెక్టులను ప్రారంభించారు.
విశాఖ పోర్టు పరిధిలో యాంత్రీకరణ పనులను పీపీపీ పద్దతిలో చేపట్టినట్టు అధికారులు వివరించారు. ఈక్యూ 7, డబ్ల్యూ క్యూ 7, 8, డబ్ల్యూక్యూ 6 మూడు బెర్త్‌లను యాంత్రీకరించే (Port Berths Mechanization) పనిని విశాఖ పోర్టు చేపట్టింది. ఇందుకోసం పోర్టు 655 కోట్ల రూపాయలు కేటాయించింది. ఈ మూడు ప్రాజెక్టులకు సంబంధించి ప్రధాని శంకుస్ధాపన చేశారు. విస్తరించిన విశాఖ కంటైనర్ టర్మినల్ ఫేజ్ 2 ప్రాజెక్టును (Visakha Container Terminal Extension) ప్రధాని జాతికి అంకితం చేశారు. ఈ ప్రాజెక్టులు డీబీఎఫ్ఓటీ విధానంలో (Design Build Finance Operate Transfer) సుమారు 633 కోట్ల రూపాయలతో విస్తరించనున్నారు. కార్యక్రమానికి పోర్టు అధికారులు అనుబంధ సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు.