ఈనాడు, ఈటీవీ ఆధ్వర్యంలో విశాఖలో ఓటరు నమోదుపై అవగాహనా కార్యక్రమాలు - ఓటరు నమోదు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 3, 2024, 12:18 PM IST
Voter Registration Campaign at Visakha: కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాష్ట్రంలో పలుచోట్ల ఓటరు నమోదుపై యువతకు అవగాహన కల్పించేందుకు ఈనాడు, ఈటీవీ సంస్థలు సామాజిక బాధ్యతా సదస్సు నిర్వహిస్తోంది. విశాఖ తూర్పు నియోజక వర్గంలోని ఎస్వీవీపీ(S.V.V.P), వీఎమ్సీ(V.M.C) కళాశాలలో విద్యార్థులకు ఓటు హక్కుపై అవగాహన కల్పిస్తోంది. ఈ కార్యక్రంలో భాగంగా నిర్వాహకులు ఆన్లైన్ ద్వారా ఓటు నమోదు(Vote Registration Process Online) చేసుకునే విధానంపై అవగాహన కల్పించారు. దీంతోపాటు ఓటు నమోదు పత్రాలు ద్వారా నమోదు చేసుకునే విధానాన్ని కూడా తెలియజేశారు.
Eenadu ETV Voter Awarness Seminar: ఈ సందర్భంగా దేశంలోని పౌరులందరికీ భారత రాజ్యాంగం ఓటు హక్కును కల్పించిందని కళాశాల ప్రిన్సిపాల్ జగదీశ్వర్ రావు గుర్తుచేశారు. బాధ్యతాయుతంగా ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకుని, సమర్థవంతమైన నాయకుడని ఎన్నుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఓటరు నమోదు, ఓటు వినియోగంపై అవగాహనా కార్యక్రమం వల్ల తమకెన్నో విషయాలు తెలిశాయని విద్యార్థులు చెప్పుకొచ్చారు.