Volunteers Protest: పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను ఖడించిన వాలంటీర్లు.. క్షమాపణ చెప్పాలని డిమాండ్ - ఉరవకొండలో వాలంటీర్ల నిరసన ర్యాలీ
🎬 Watch Now: Feature Video

Volunteers Protest Against Pawan Kalyan in State : మహిళల అక్రమ రవాణాలో గ్రామ వాలంటీర్లు, వైఎస్సార్సీపీ నేతలు కీలకంగా ఉన్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వాలంటీర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. వాలంటీర్ల వ్యవస్థపై పవన్ వ్యాఖ్యలను నిరసిస్తూ రాష్ట్రంలో పలు చోట్ల వాలంటీర్లు ఆందోళనలు చేపట్టారు. పవన్ వ్యాఖ్యలు వాలంటీర్ల మనోభావాలను దెబ్బతీసేవిలా ఉన్నాయని.. ఆయన వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు జానీ బాషా డిమాండ్ చేశారు. విజయవాడ ఎన్టీఆర్ సర్కిల్‌లో పవన్ కల్యాణ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గుంటూరులో హిందూ కళాశాల కూడలిలో మానవహారం నిర్వహించారు. కొవిడ్ కష్టకాలంలో సేవలందించిన వాలంటీర్లపై పవన్ అనుచిత వ్యాఖ్యలు చేయటం తగదని పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు అన్నారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో వాలంటీర్లు నిరసన ప్రదర్శన చేపట్టారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో వాలంటీర్లు నిరసన ర్యాలీ చేపట్టారు. ప్రజలకు సేవ చేస్తున్న వాలంటీర్లను కించపరిచేలా మాట్లాడిన పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు.