Volunteer Attack on Village Secretariat Employee తలుపులు మూసి, ఫ్యాన్ పైప్‌తో సచివాలయ ఉద్యోగిపై వాలంటీర్ దాడి..
🎬 Watch Now: Feature Video
Volunteer Attack on Village Secretariat Employee సచివాలయ ఉద్యోగిపై గ్రామ వాలంటీర్ దాడి చేసిన ఘటన పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించి ఎస్ఐ తెలిపిన వివరాల ప్రాకారం... చిలకలూరిపేట పట్టణంలోని 6వ వార్డు, ఒకటో సచివాలయంలో బూదాటి శ్రీనివాస్ అడ్మిన్ గా పనిచేస్తున్నారు. వాలంటీర్ వినోద్‌కు వచ్చే జీతం ఆపాడని నెపంతో... సచివాలయ తలుపులు మూసి అడ్మిన్ శ్రీనివాస్ ను వాటర్ పైప్ తో చితకబాదాడు. చుట్టుపక్కల వారు వచ్చి తలుపులు తీయడంతో అతనిపై దాడిని ఆపినట్లు శ్రీనివాస్ తెలపారు. తాను అసలే డయాలసిస్ చికిత్స తీసుకుంటున్నట్లు శ్రీనివాస్ వెల్లడించారు. దాడి ఘటనతో ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యినట్లు పేర్కొన్నాడు. స్థానికులు వెంటనే అతనిని చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స తీసుకున్న అనంతరం అర్బన్ పోలీస్ స్టేషన్ చేరుకున్న శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. శ్రీనివాస్ ఫిర్యాదు మేరకూ వాలంటీర్ వినోద్ అదుపులోకి తీసుకున్నట్లు అర్బన్ ఎస్ఐ మోహన్ తెలిపారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టినున్నట్లు తెలిపారు.