మద్యం అక్రమంగా సరఫరా చేస్తున్న వాలంటీర్ అరెస్టు, 14 రోజుల రిమాండ్ - Dhone news
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 15, 2023, 12:28 PM IST
Volunteer Arrested in Illegal Liquor Case in Nandyal District : మద్యం అక్రమ రవాణా కేసులో వార్డు వాలంటీర్ అరెస్టు కావడం నంద్యాల జిల్లాలో కలకలం రేపింది. నంద్యాల జిల్లా డోన్ పట్టణం పాతపేటకు చెందిన నాలుగో వార్డులో సింగం నరేష్ వాలంటీర్గా పనిచేస్తున్నారు. ఇతను మద్యం అక్రమంగా రవాణా చేస్తున్నాడని పోలీసులు కేసు నమోదు చేశారు. స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో(Special Enforcement Bureau) సీఐ భీమలింగ తెలిపిన వివరాల మేరకు.. అక్టోబర్ 25న పట్టణంలోని కొండపేటలో, అదేవిధంగా నవంబరు ఒకటో తేదీన ఉడుములపాడు గ్రామంలో, నవంబరు ఆరున పాతపేటలో కర్నాటక మద్యం లభించింది.
ఈ కేసుల్లో వీరిని అరెస్టు చేసి విచారించగా ఈ ముగ్గురికి మద్యం సరఫరా చేసింది.. వాలంటీర్ సింగం నరేష్ అని తేలడంతో అతనిపై కేసు నమోదు చేశారు. నిందితుడిపై ఇదివరకే మూడు కేసులు ఉన్నాయని తెలిపారు. నరేష్పై కేసు నమోదు అయినప్పటి నుంచి అతను పరారీలో ఉన్నాడు. మంగళవారం నేరుగా నిందితుడు డోన్ కోర్టులో న్యాయమూర్తి ఎదుట లొంగిపోయాడు. న్యాయమూర్తి అతనికి 14 రోజులు రిమాండ్ విధించినట్లు సెబ్ సీఐ తెలిపారు.