Vishakha CP on Riti Saha Death Case: బెంగాల్ విద్యార్థిని మృతిపై వీడని సందిగ్ధం.. 'ఫోరెన్సిక్ నివేదిక వస్తేనే..!' - విశాఖలో బెంగాల్ విద్యార్థిని సూసైడ్
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 24, 2023, 6:36 PM IST
Vishakha CP on Riti Saha Death Case : హాస్టల్ భవనంపై నుంచి పడి విద్యార్థిని అనుమానాస్పద మృతి ఘటనలో ఫోరెన్సిక్ నివేదిక కోసం ఎదురు చూస్తున్నామని... విశాఖ సీపీ త్రివిక్రమ వర్మ తెలిపారు. పోలీస్ కాన్ఫరెన్స్ హాలులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత నెల 14న రాత్రి సమయంలో హాస్టల్ మూడో ఫ్లోర్ నుంచి బెంగాల్ చెందిన రితీసాహా కింద పడింది. అనంతరం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గత నెల 16వ తేదీ మృతి (Kolkata Student Riti Saha Death Case Updates) చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అదే రోజు రితీసాహా తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. రితీ మృతిపై తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేశారు. తాము సీసీ ఫుటేజ్ పరిశీలించామని, హత్యాయత్నం జరిగినట్లు దర్యాప్తులో గుర్తించలేదని సీపీ వివరించారు. హాస్టల్ రూం మేట్లు ముగ్గురితో నేరుగా మాట్లాడినట్లు ఆయన తెలిపారు. ఫోరెన్సిక్ నివేదిక కోసం ఎదురు చూస్తున్నామని.. ఇద్దరు ఏసీపీలు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారని సీపీ త్రివిక్రమ వర్మ అన్నారు. రితీ మృతిపై ఇటీవల బెంగాల్ పోలీసులు కేసు నమోదు చేశారు.