వైకుంఠ ఏకాదశి పర్వదినం - తిరుమలలో వీఐపీల సందడి - రోజా తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 23, 2023, 4:05 PM IST
VIP'S at Tirumala Vaikunta Ekadashi Celebrations : వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తిరుమల భక్తులతో కిటకిటలాడుతోంది. తెల్లవారుజాము నుంచి స్వామివారి దర్శనార్థం ఆలయాల వద్ద భక్తులు బారులు తీరారు. శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి ప్రముఖులు తరలివచ్చారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ స్వామి వారి సన్నిధిలో దైవారాధనలో పాల్గొన్నారు.
Minister Roja, Ambati In Tirumala Tirupati Temple : రాష్ట్ర మంత్రులు రోజా, పెద్దిరెడ్డి, నారాయణ స్వామి, ఉష శ్రీచరణ్, మేరుగు నాగార్జున, చెల్లుబోయిన, అంబటి రాంబాబు, కారుమూరి, గుడివాడ అమర్నాథ్ స్వామి వారిని దర్శించకున్నారు. ఎంపీ ప్రభాకర్ రెడ్డి, ఉప సభాపతి వీరభద్ర, రఘురామ కృష్ణంరాజు, అచ్చెన్నాయుడు, బీజేపీ ఎంపీ సి.ఎం.రమేశ్ సహా ఎంతోమంది ప్రముఖులు శ్రీవారిని దర్శించుకున్నారు. సినీ నటుడు బండ్ల గణేష్ దంపతులు స్వామి వారిని పూజించారు.