villagers rejected YCP MLA : 'గడప గడపకు' తాళాలు.. ఇళ్లపై టీడీపీ జెండాలు'.. వైసీపీ ఎమ్మెల్యేకు నిరసన సెగ - ఎమ్మెల్యేకు నిరసన సెగ
🎬 Watch Now: Feature Video
villagers rejected YCP MLA In Gadapa Gadapaku Mana Prabhutwam : చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే వెంకటేగౌడ పర్యటనలో నిరసన వెల్లువెత్తింది. పార్టీ స్థానిక నేతలకు సమాచారం ఇవ్వకుండానే గడప గడపకు ఎమ్మెల్యే.. కార్యక్రమం నిర్వహించగా.. గ్రామస్తులు ఇళ్లకు తాళాలు వేసి వెళ్లిపోయారు. మరికొందరు తమ ఇళ్లపై టీడీపీ జెండాలు ఎగురవేశారు. ఇదిలా ఉండగా.. కార్యక్రమంలో మహిళలు నిలదీయడంతో ఎమ్మెల్యే అసహనానికి లోనయ్యారు. పెద్దపంజాణి జడ్పీటీసీ భర్త, వైసీపీ మండల కన్వీనర్ బాగా రెడ్డి సొంత గ్రామమైన ముదరం పల్లెలో ఎమ్మెల్యేకు చేదు అనుభవం ఎదురైంది. స్థానిక సర్పంచ్ మంజులా రెడ్డికి సమాచారం ఇవ్వకుండా ఎమ్మెల్యే కార్యక్రమం నిర్వహించడమే ఈ వ్యతిరేకతకు కారణం అని తెలుస్తోంది. సర్పంచ్ మంజులా రెడ్డి వైసీపీ రాష్ట్ర కార్యదర్శి అయిన విజయ భాస్కర్ రెడ్డి భార్య. గడపగడపకు మన ప్రభుత్వంలో భాగంగా చామనేరు పంచాయతీ పరిధిలోని మూడు గ్రామాల్లో పర్యటించిన ఎమ్మెల్యేను గ్రామస్తులు తిరస్కరించారు. ప్రతి ఇంటిపై తెలుగుదేశం జెండాలు ఎగురవేస్తూ ఎమ్మెల్యే పర్యటిస్తున్న సమయంలో ఇళ్లకు తాళాలు వేశారు. బాధిత ప్రజలు వారి సమస్యలపై నిలదీస్తున్న సమయాన.. రిపోర్టర్లు ఫోన్లో చిత్రీకరించగా వాటిని లాక్కొవాల్సిందిగా ఎస్సై శ్రీనివాసులను ఎమ్మెల్యే ఆదేశించడం కొసమెరుపు.