ETV Bharat / state

వీధుల్లో తిరుగుతూ అమ్మకాలు - కానీ అసలు పని వేరే - ACCUSED ARRESTED IN GOLD THEFT CASE

ప్లాస్టిక్​ సామన్లు, బెలూన్ల విక్రయం - తాళం వేయకుండా కొద్దిసేపు అలా వెళ్లారంటే ఇలా ఇల్లు గుల్ల - విజయనగరం జిల్లాలో భార్యాభర్తల నయా దోపిడీ

ACCUSED ARRESTED IN GOLD THEFT CASE
ACCUSED ARRESTED IN GOLD THEFT CASE (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 4, 2025, 8:44 PM IST

Gold Stolen Case in Vizianagaram District: బిక్షాటన, ప్లాస్టిక్ సామన్లు, బెలూన్ల అమ్మకాల పేరుతో వీధుల్లో తిరుగుతారు. అదే సమయంలో ఇళ్లపై కన్నేస్తారు. వీధుల్లో ఒక చోట కూర్చుని ఎవరైనా ఇంటికి తాళం వేయకుండా దగ్గరలోని దుకాణం లేదా పనిమీదకు బయటకు వెళ్తే వెంటనే అందినకాడికి దోచేస్తారు. ఈ తరహా దోపిడీ విజయనగరం జిల్లాలో చోటు చేసుకుంది. దొంగల వద్ద నుంచి దాదాపు 18 తులాల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని వారిని అరెస్టు చేశారు.

ఇద్దరూ దొంగలే: విజయనగరం ఒకటో పట్టణ పోలీసు స్టేషన్ పరిధి కంటోన్మెంట్ ప్రాంతంలోని ఓ ఇంట్లో 18 తులాల బంగారు నగల చోరీ జరిగింది. నిందితులు జార్ఘండ్ రాష్ట్రానికి చెందినవారని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. దొంగతనానికి పాల్పడిన వ్యక్తులు ఇరువురూ భార్యాభర్తలని పోలీసుల విచారణలో తేలింది. బాధితుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఇరువురినీ అరెస్టు చేసి వారి వద్ద నుంచి 18 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ వకుల్ జిందల్ ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.

విజయనగరంలో భారీ చోరీ.. 5 కిలోల బంగారం ఎత్తుకెళ్లిన దొంగలు

జార్ఘండ్ రాష్ట్రం టాటా నగర్​కు చెందిన భార్యాభర్తలు నేహ సబర్, సరోజ్ జానీ పట్టణాల్లో బిక్షాటన, ప్లాస్టిక్ సామన్లు, బెలూన్ అమ్మకాల పేరుతో వీధుల్లో తిరుగుతూ దోపిడీలకు పాల్పడుతుంటారు. ఈ క్రమంలో విజయనగరం ఒకటో పట్టణ పోలీసు స్టేషన్ పరిధి కంటోన్మెంట్ కాలనీ కాళిఘాట్ వీధిలో జగన్ మోహన్ అనే వ్యక్తి ఇంటిలో గత నెల 24న దోపిడీకి పాల్పడ్డారు. చిన్నపాటి పనిమీద ఇంటికి తాళం వేయకుండా జగన్మోహన్, అతని భార్య బయటకు వెళ్లినట్లు గమనించిన నేహ సబర్ దీన్నే అదనుగా చూసుకుని క్షణాల్లో ఇంటిలోకి చొరబడి బంగారాన్ని కాజేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.

వీధుల్లో తిరుగుతూ అమ్మకాలు - కానీ అసలు పని వేరే (ETV Bharat)

"బాధితుని ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేయగా జార్ఘండ్ రాష్ట్రం టాటా నగర్ కు చెందిన నేహ సబర్, భర్త సరోజ్ జానీ ఈ తరహా దోపిడీకి పాల్పడినట్లు గుర్తించి వారిని అరెస్టు చేశాం. వారి వద్ద నుంచి దోచుకున్న 18 తులాల మొత్తం బంగారాన్ని స్వాధీనం చేసుకున్నాం. వీరు గతంలో విశాఖలోనూ ఈ తరహా దోపిడీలకు పాల్పడుతూ పోలీసులకు పట్టుబడినట్లు విచారణలో వెల్లడైంది." -వకుల్ జిందల్, విజయనగరంజిల్లా ఎస్పీ

స్పెయిన్, ఇటలీలో సెటిల్ అవుతారా? డబ్బులిచ్చి మరీ ఆహ్వానం.. ఆఫర్లు చూసేయండి

ఒక్క మగాడు.. 105 పెళ్లిళ్లతో గిన్నిస్ రికార్డ్.. ఎవరికీ విడాకులు ఇవ్వకుండానే..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.