కొత్తవలస స్టేషన్‌ను ప్రపంచస్థాయి రైల్వేస్టేషన్‌గా తీర్చుదిద్దుతాం: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ - Union Railway Minister Ashwani Vaishnav news
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/09-12-2023/640-480-20227665-thumbnail-16x9-union-railway-minister-ashwani-comments.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 9, 2023, 10:11 PM IST
Vikasit Bharat Sankalpa Yatra Updates: కొత్తవలస రైల్వే స్టేషన్‌ను ప్రపంచ స్థాయిలో తీర్చిదిద్దుతామని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ అన్నారు. వికసిత్ భారత్ సంకల్పయాత్రలో భాగంగా ఆయన విజయనగరంలో పర్యటించారు. ఈ సందర్భంగా కేకే లైన్‌ను డబుల్ లైన్‌గా మార్చనున్నామని తెలిపారు. విశాఖ-బెనారస్ మధ్య రైళ్ల ఫ్రీక్వెన్సీని పెంచుతామన్నారు. ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్‌కు రైల్వే బడ్జెట్ కేటాయింపుల్లో ఉదారంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు.
Union Railway Minister Ashwani Vaishnav Comments: ''సంక్షేమ కార్యక్రామాలకు అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి ప్రధాని మోదీ అనేక సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఉజ్వల్ గ్యాస్ కనెక్షన్‌ను ఉచితంగా అందిస్తున్నాం. కోవిడ్ సమయంలో రెండు డోస్‌ల వ్యాక్సిన్ వేసే ప్రక్రియను చేపట్టాం. ఒక్కప్పుడు కొలాయి ద్వారా నీరు కావాలంటే విశాఖ లాంటి నగరాలు వెళ్లేవారు. ఇప్పుడు ప్రతి ఇంటికీ కొలాయి అందించే విధంగా కేంద్ర చర్యలు తీసుకుంది. ఆయుష్మాన్ కార్డు ద్వారా అయిదు లక్ష రూపాయలను కేంద్రం భరిస్తుంది. కొత్తవలస స్టేషను వరల్డ్ క్లాస్ రైల్వేస్టేషన్‌గా తీర్చు దిద్దుతాం. కేకే లైన్‌ను డౌబుల్ లైన్‌గా మార్చబోతున్నాం. దీంతో ఏపీకి మరిన్ని రైళ్లు వచ్చే అవకాశం ఉంటుంది.'' అని రైల్వేశాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ అన్నారు.