ముగిసిన కడప పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాలు - భారీ సంఖ్యలో పోలీస్ బందోబస్తు
🎬 Watch Now: Feature Video
Urusu festival in Kadapa Pedda Dargah: కడప జిల్లాలో ప్రసిద్ధిగాంచిన పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాల్లో భాగంగా.. చివరి రోజున దర్గా పీఠాధిపతి అరిఫుల్ల హుసేని ఊరేగించారు. అనంతరం గజమాలతో సన్మానించారు. ఈ ఉత్సవాలకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీ సంఖ్యలో ముస్లిం సోదరులు హాజరయ్యారు. నగర వీధుల్లో తెల్లవారుజాము వరకు ఉరేగింపు కొనసాగింది. కుర్రకారు నృత్యాలు, పకీర్ల విన్యాసాలతో ఊరేగింపు అంబరాన్ని అంటింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు కలగకుండా పోలీస్‌లు బందోబస్తు ఏర్పాటు చేశారు.
Kadapa Dargah Urusu Celebrations: ప్రసిద్ధిగాంచిన కడప పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాలు మూడురోజులపాటు అంగరంగ వైభవంగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా 79వ కవి సమ్మేళనాన్ని నిర్వహించగా.. వివిధ రాష్ట్రాల నుంచి భారీ ఎత్తున కవులు, భక్తులు ఈ ఉత్సవాలకు హాజరయ్యారు. కవులు పాడేటువంటి పాటలు, కవితలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కవి సమ్మేళనాన్ని తిలకించేందుకు భక్తులు ఆసక్తిచూపారు. ప్రజలు ఈ ఉరుసు ఉత్సవాలను ఎంతో ఆసక్తికరంగా తిలకించారు.