112 మంది విద్యార్థినిలు- 3 మరుగుదొడ్లు! సమస్యల వలయంలో ఉరవకొండ బాలికల వసతి గృహం - ఉరవకొండ బాలికల వసతి గృహం

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 23, 2023, 9:53 PM IST

Uravakonda Govt Girls Hostel Problems: అనంతపురం జిల్లాలోని ఉరవకొండలోని సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహంలోని విద్యార్థినిలు అనేక సమస్యలను ఎదుర్కోంటున్నారు. ఇందులో రెండో తరగతి నుంచి పదో తరగతి వరకు విద్యనభ్యసిస్తున్న విద్యార్థినులు, దాదాపు 112 మంది విద్యార్థినిలు ఉంటున్నారు. వసతి గృహంలో కేవలం మూడే గదులు ఉన్నాయని, అందులో ఒకటి వర్షం పడినప్పుడు ఉరుస్తుందని విద్యార్థినిలు వాపోతున్నారు. తలుపులు, కిటికీలు, సరిగా లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పడుకోవడానికి బెడ్లు లేక నేలపైనే నిద్రించాల్సి వస్తోందన్నారు. ప్రహరీ గోడ సరిగా లేదని, 10 స్నానపు గదులే ఉన్నాయని విద్యార్థినిలు తమ సమస్యలను వివరించారు. కేవలం 3మరుగుదోడ్లు మాత్రమే ఉన్నాయని, దీనివల్ల అనేక ఇబ్బందులను ఎదుర్కోంటున్నామన్నారు. ఈ సమస్యలను అధికారులు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఎస్​ఎఫ్​ఐ విద్యార్థి సంఘం నాయకులు మండిపడ్తున్నారు. కనీసం విద్యుత్​ లైట్లు, ఫ్యాన్​ సౌకర్యాలు కూడా సరిగా లేవని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యలను పరిష్కరించాలని వారు కోరుతున్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.