thumbnail

By

Published : May 25, 2023, 12:24 PM IST

ETV Bharat / Videos

Civils 3rd Ranker Interview: "భవిష్యత్తులో విద్యారంగం, మహిళాభివృద్ధి కోసం కృషి చేస్తా"

Civils 3rd Ranker Uma Harathi Interview  : అందరు ఎదురు చూసిన యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ నిర్వహించిన సివిల్‌ సర్వీసెస్‌ 2022 ఫలితాలు విడుదలయ్యాయి. దేశవ్యాప్తంగా మొత్తం 933 మంది ఈ పరీక్షల ద్వారా వివిధ సర్వీసులకు ఎంపికయ్యారు. వారిలో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఎప్పటిలాగే ఈ సారి కూడా సత్తాచాటారు. అందులో ఈ యువ ర్యాంకర్‌ కూడా ఒకరు. అయితే ఈ విజయం వెనుక ప్రత్యేక శిక్షణతోపాటు.. ఎన్నో రోజుల కృషి దాగి ఉందని చెబుతున్నారు. నేర్చుకోవాలనే ఆసక్తి.. సాధించాలనే పట్టుదలతో ప్రయత్నిస్తే విజయం తప్పక వరిస్తుందంటున్నారు సివిల్స్​ ఫలితాల్లో మూడో ర్యాంకు సాధించిన నూకల ఉమా హారతి.

తెలంగాణకు చెందిన ఉమా హారతి.. నారాయణ పేట జిల్లా ఎస్పీ నూకల వెంకటేశ్వర్లు కుమార్తె. సరైన లక్ష్యం.. అందుకు తగ్గ ప్రణాళిక ఉంటే సివిల్స్​లో ఉత్తమ ర్యాంకు సాధించవచ్చని ఆమె తెలిపారు. తన పట్టుదలకు కుటుంబ ప్రోత్సాహం ఉండటం వల్లే ఐదో ప్రయత్నంలో తాను మూడో ర్యాంకును సాధించిన వెల్లడించారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా నిరుత్సాహ పడకుండా.. అనుకున్న లక్ష్యాన్ని సాధించేలా సన్నద్ధమయ్యానని చెప్పారు. భవిష్యత్తులో విద్యారంగం, మహిళాభివృద్ధి కోసం కృషి చేస్తానని హారతి పేర్కొన్నారు.

'ఏదో ఒక ర్యాంకు వస్తే చాలనుకున్నాను. మూడో ర్యాంకు వస్తుందని మాత్రం అస్సలు ఊహించలేదు. రోజూ ఏడెనిమిది గంటల పాటు చదివేదాన్ని. ముందుగా జాగ్రఫీ ఆప్షనల్‌ సబ్జెక్టు ఉండేది. ఆ తర్వాత ఆంత్రోపాలజీకి మారాను. ఐదేళ్లుగా నేను ప్రిపేర్‌ అవుతున్నాను. ఈ ప్రాసెస్‌లో కుటుంబ సభ్యుల సపోర్టు, ఎమోషనల్‌ సపోర్టు చాలా అవసరం. అది ఉంటే చాలు. సమాచారం, పుస్తకాలు.. అన్నీ ఆన్‌లైన్‌లో ఉచితంగా దొరుకుతాయి. కానీ ఎమోషనల్‌, ఫ్యామిలీ సపోర్టు మాత్రం దొరకదు కదా.. అదే చాలా అవసరం. మహిళలు, పురుషులు ఎవరైనా సరే.. కుటుంబం సపోర్టు చేస్తే సాధించవచ్చు. ఒకవేళ పరీక్షల్లో ఫెయిల్‌ అయినా నిరాశ పడొద్దు. ఎవరి నుంచైనా మనం స్ఫూర్తిపొందవచ్చు. నా తల్లిదండ్రులు కూడా చాలా సపోర్టు ఇచ్చారు. సివిల్స్‌ సాధించే వరకు రాద్దామని నిర్ణయించుకొని రాశాను. నా ఫ్రెండ్స్‌ చాలా సపోర్టు చేశారు. నూటికి నూరు శాతం మా నాన్నే నాకు స్ఫూర్తి'. - నూకల ఉమా హారతి, సివిల్స్ మూడో ర్యాంకు

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.