రైతన్నలను ముంచిన వర్షాలు - పంటను కాపాడేందుకు నానావస్థలు
🎬 Watch Now: Feature Video
Unseasonal Rains Damage Crops: అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో మూడు రోజులుగా మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా 1 లక్ష 52 వేల ఎకరాల విస్తీర్ణంలో రైతులు సాగు చేశారు. పంటలు కోతలు జరుగుతున్న సమయంలో వర్షాలు పడుతుండంతో.. రైతులు మథనపడుతున్నారు. సుమారు 25 వేల ఎకరాలలో మాత్రమే కోతలు పూర్తయ్యాయని, మిగిలిన పొలాలను కోసేందుకు రైతులు సమాయత్తమవుతున్నారు. కోసిన పంట తడిసిపోకుండా.. రాశులపై రైతన్నలు టార్పాలిన్లు కట్టారు. ఇలాగే వర్షాలు పడితే ఖరీఫ్ పంట దెబ్బతినే ప్రమాదం ఉందని.. రైతులు ఆందోళన చెందుతున్నారు.
"పంట కోతలు జరుగుతున్న సమయంలో జిల్లాలో మోస్తరు వర్షాలు పడుతున్నాయి. దీంతో కోసిన పంట తడిసిపోయకుండా ఉండేందుకు మేము నానా అవస్థలు పడుతున్నాం. జిల్లాలో ఇలాగే వర్షాలు పడితే ఖరీఫ్ పంట దెబ్బతినే ప్రమాదం ఉంది. అప్పులు చేసి మరీ పంటకు పెట్టుబడి పెట్టాం. ఇప్పుడు ఏం చేయాలో మాకు అర్థం కావడం లేదు." - అన్నదాతల ఆవేదన