సాయంలో వివక్ష - రోడ్డుపై బైఠాయించి తువానిగుంట కాలనీవాసుల ధర్నా - మహిళల ఆందోళన

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 8, 2024, 3:28 PM IST

Updated : Jan 8, 2024, 3:41 PM IST

Tuvanigunta Colony Women Protest on Road: అధికారంలో ఉన్న వ్యక్తి ప్రజలకు అందించే సంక్షేమ పథకాలు, ప్రభుత్వ సహాయ కార్యక్రమాల్లో వివక్షత చూపకూడదు. ఎటువంటి తారతమ్యాలు లేకుండా ప్రజలందరికి ప్రభుత్వం నుంచి సహాయం అందాలే చూడాలి. కానీ ఇటువంటి నియమాలు జగన్ సర్కారుకు వర్తించవు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఒకరికి అందితే ఒకరికి అందవు. ప్రజలకు నామమాత్రంగా సరఫరా చేసి అందరికీ సహాయం అందించాం అని చేతులు దులిపేసుకుంటారు. తాజాగా తిరుపతి జిల్లాలో ఇటువంటి సంఘటన చోటు చేసుకుంది.  

నాయుడుపేట తువానిగుంటలో తుపాను నష్టపరిహారంగా రాష్ట్ర ప్రభుత్వం అందించిన బియ్యం, నగదు తమకు రాలేదని కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పక్కనే ఉన్న బీడీ కాలనీ వాసులకు సరుకులు పంపిణీ చేసి పక్కనే ఉన్న తమ కాలనీకి మాత్రం ఇవ్వలేదని మండిపడ్డారు. రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టారు. మేనకూరు సెజ్​కు వెళ్లే వాహనాలను మహిళలు ఆపేయటంతో ఇరువైపులా ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు అక్కడి చేరుకొని బాధితులతో మాట్లాడినా ఫలితం లేకపోవడంతో వాహనాలు వేరే మార్గంలో పంపించారు.

Last Updated : Jan 8, 2024, 3:41 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.