'అలిపిరి పాదాల మండపం పునరుద్ధరణ అందుకే' - డిసెంబర్ 23నుంచి వైకుంఠ ఉత్తర ద్వార దర్శనం : టీటీడీ ఈవో

🎬 Watch Now: Feature Video

thumbnail

TTD EO Dharma Reddy on Reconstruction of Alipiri Mandapam: మరమ్మతులు చేయలేని పరిస్థితిలోనే అలిపిరి పాదాల మండపాన్ని పునర్నిర్మించాలని నిర్ణయించినట్లు తితిదే ఈవో ధర్మారెడ్డి తెలిపారు. పాదాల మండపం పురావస్తు శాఖ పరిధిలో లేదన్నారు. పాదాల మండపంలోని 90 శాతం స్తంభాలను వినియోగించే పునరుద్ధరణ చేస్తామన్నారు. తిరుపతి స్థానిక నేత భానుప్రకాష్ రెడ్డి... అలిపిరి పాదాల మండపం వద్దకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరిని తీసుకొని వెళ్లడాన్ని ఈవో తప్పుబట్టారు. పార్వేట మండపాన్ని మరమ్మతు చేసే అవకాశం లేనందునే జీర్ణోద్ధరణ చేశామని వివరించారు. 

డిసెంబరు 23నుంచి పది రోజుల పాటు జరిగే వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వారా దర్శనానికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని ధర్మారెడ్డి తెలిపారు. నవంబర్ 10 నుంచి 300 రూపాయల ప్రత్యేక దర్శన టికెట్లను ఆన్ లైన్​లో విడుదల చేస్తామన్నారు. డయల్ యువర్ ఈవో (Dial Your Evo program) కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీవాణి ట్రస్టు దాతలకు పది రోజులకు గాను 20 వేల టికెట్లను అందుబాటులో ఉంచామని, సర్వ దర్శన టికెట్లు పది రోజులకు గాను 4.25 లక్షల టోకెన్లు తిరుపతిలోని తొమ్మిది ప్రాంతాల్లో భక్తులు పొందే వెసులుబాటు కల్పిస్తున్నామన్నారు. పది రోజుల పాటు ప్రముఖులకు సైతం మహా లఘు దర్శనమే ఉంటుందన్నారు.. టోకెన్లు కలిగిన భక్తులు 24 గంటల ముందు మాత్రమే తిరుమలకు రావాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.