Tribals Carried Sick Woman in Doli at Charlapalli: ఇంకెన్నాళ్లు ఈ మోతలు.. ఏజెన్సీ ప్రాంతాల్లో ఆగని మరణ మృదంగం!
🎬 Watch Now: Feature Video
Tribals Carried Sick Woman in Doli at Charlapalli : ఏజెన్సీ ప్రాంతాల్లో రహదారి లేక డోలీ మోతలలో ఆసుపత్రికి తరలిస్తున్న తరుణంలో గిరిజన మహిళల మరణ మృదంగం ఆగడం లేదు. అల్లూరి సీతారామరాజు జిల్లా జీకే మండలం చర్లపల్లిలో రహదారి లేక సరస్వతి అనే బాలింతను డోలిలో ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఆమెకు మూడు నెలల కిందట శిశువు జన్మించి మృతి చెందింది. ఈ బాధ నుంచి నుంచి కోలుకోక ముందే సరస్వతి అనారోగ్యం పాలైంది. సరస్వతి తీవ్ర అస్వస్థకు గురి కావడంతో.. బంధువులు అతి కష్టం మీద మూడు కిలోమీటర్లు డోలి మీద అంబులెన్స్ దగ్గరికి చేర్చారు. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ఆమె మృతి చెందింది.
No Roads in Alluri Sitaramaraju District Agency Areas : ఆసుపత్రికి తరలించే ముందు డోలి మోస్తూ మాకు రహదారులు నిర్మించండి మహాప్రభు అంటూ గిరిజనులు మొరపెట్టుకున్నారు. ఇంకా ఎన్నాళ్లు ఈ డోలిమోతలు, మరణాలు అని విచారం వ్యక్తం చేశారు. అడగరాపల్లి నుంచి ఎల్లవరం వరకు రోడ్డు బాగోలేదని ప్రజాప్రతినిధులకు, అధికారులకు ఎన్ని సార్లు విన్నవించుకున్న పట్టించుకోవడం లేదని, గ్రామానికి కనీసం ద్విచక్రవాహనం కూడా రాలేని పరిస్థితి ఉందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. పాలకులు ఇప్పటికైనా కనికరించండని.. తమ గ్రామానికి రహదారి నిర్మించాలని వారు వేడుకుంటున్నారు.