Trains Cancelled: ఒడిశా రైళ్ల ప్రమాద ఘటన.. 21 రైళ్లు రద్దు, 11 రైళ్లు దారి మళ్లింపు - AP Railway Department important news
🎬 Watch Now: Feature Video
Arrangement of help numbers at vijayawada railway stations: ఒడిశా రాష్ట్రం బాలేశ్వర్ జిల్లా బహానగా రైల్వే స్టేషన్ సమీపంలో శుక్రవారం రాత్రి ఘోర రైళ్ల ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో ఆంధ్రప్రదేశ్ రైల్యేశాఖ అప్రమత్తమైంది. అన్ని రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల కోసం హెల్ప్ లైన్ నెంబర్లతోపాటు సహాయక చర్యలు ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో విజయవాడ రైల్యే స్టేషన్‌లోనూ హెల్ప్‌లైన్ నెంబర్లు, సహాయక చర్యలు ఏర్పాటు చేశామని, విజయవాడ రైల్వేస్టేషన్ మీదుగా ఒడిశాకు వెళ్లే పలు రైళ్ల రద్దు, రైళ్ల దారి మళ్లింపు వంటి వివరాలను రైల్యే అధికారులు ఈటీవీ భారత్‌కు తెలియజేశారు.
21 రైళ్లు రద్దు-11 రైళ్లు దారిమళ్లింపు.. ఒడిశా రాష్ట్రంలో జరిగిన ఘోర రైళ్ల ప్రమాదం కారణంగా.. విజయవాడ మీదుగా ఈరోజు, రేపు నడిచే 21 రైళ్లను రద్దు చేసినట్లు రైల్యేశాఖ అధికారులు తెలిపారు. దీంతోపాటు విజయవాడ మీదుగా ఇవాళ, రేపు నడిచే 11 రైళ్లను దారి మళ్లించినట్లు పేర్కొన్నారు. రైళ్ల రద్దు, మళ్లింపుకు సంబంధించిన వివరాలన్నింటినీ ఓ బోర్టుపై రాసి, స్టేషన్లలోని టికెట్ కౌంటర్ వద్ద ఉంచమన్నారు. దీంతోపాటు రద్దైన, దారి మళ్లించిన రైళ్ల వివరాలు తెలుసుకునేందుకు హెల్ప్‌లైన్ నెంబర్లు కూడా ఏర్పాటు చేశామన్నారు.
''ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంతో ఏపీ రైల్వే శాఖ అప్రమత్తమైంది. అన్ని రైల్వే స్టేషన్లలో హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేశాం. ప్రయాణికుల సమాచారం కోసం అన్ని స్టేషన్లలో సహాయక కేంద్రాలను ఏర్పాటు చేశాం. విజయవాడ రైల్వే స్టేషన్‌లో కూడా సహాయక కేంద్రాన్ని ఏర్పాటు చేశాం. ఒడిశా మీదుగా వెళ్లే పలు రైళ్ల రద్దు, పలు రైళ్ల దారి మళ్లింపు వంటి రైళ్ల వివరాలను బోర్టుపై రాసి పెట్టాము. ప్రయాణికులు వచ్చి ఏమైనా డౌట్స్ అడిగితే వివరాలు అందిస్తున్నాం. విజయవాడ మీదుగా ఇవాళ, రేపు నడిచే 21 రైళ్లు రద్దు చేశాం. ఇవాళ, రేపు విజయవాడ మీదుగా నడిచే 11 రైళ్లను దారి మళ్లించాం. రద్దైన, దారిమళ్లించిన రైళ్ల వివరాలు తెలిపేందుకు హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశాం.''- రైల్యే అధికారి, విజయవాడ